అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామానికి చెందిన నారాయణప్ప... అనంతపురం ప్రధాన రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణప్పకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించగా... అక్కడ పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నందున అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన అనంతపురం జిల్లా పాతచెరువు గ్రామంలో జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు బాధితుడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు