ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కదిరి వార్తలు

పోలీసు స్టేషన్​ ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. అప్రమత్తమైన పోలీసులు.. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

a person suicide attempt at police station
పోలీస్ స్టేషన్​ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 7, 2021, 6:02 AM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. కదిరి పట్టణం వలీసాబ్ రోడ్డు నివాసి రియాజ్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రియాజ్..​ తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించటం లేదని ఓబులదేవర చెరువు చెందిన మహబూబ్ బాషా ఓడీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్టేషన్​కు రావాలని ఎస్ఐ ఫోన్ చేయగా.. డబ్బుల విషయంలో మందలిస్తారని భయపడిన రియాజ్ సమీపంలోని కదిరి పట్టణ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్​ను ఒంటిపై చల్లుకుంటుండగా.. గుర్తించిన పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details