అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. రోజూలానే ఉపాధి హామీ పనులకు వెళ్లిన జగన్నాథ్... గుండెపోటు రావటంతో అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. కంబదూరు ఎంపీడీవో శివారెడ్డితో పాటు పలువురు మండల నాయకులు గ్రామానికి వెళ్లి జగన్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పెద్దదిక్కు జగన్నాథం మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి రావాల్సిన సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.
గుండెపోటుతో ఉపాధి కూలి మృతి - anantapur dst cordial attack death news
రోజువారి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిచిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. పనిప్రదేశంలోనే ప్రాణాలు వదిలాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
a person died in anantapur dst due to cordial attack