అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో సురేష్(23)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు2016లో డిగ్రీ పూర్తి చేశాడు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురై గ్రామసమీపంలోకి పశువులు మేపటానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు.మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య - కురుబవాండ్లపల్లిలో వ్యక్తి ఆత్మహాత్య తాజా వార్తలు
ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహాత్య చేసుకున్న ఘటన కురుబవాండ్లపల్లిలో చోటుచేసుకుంది. మృతుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
commits suicide news in Kurubawandlapalli