అనంతపురం గ్రామీణం కురుగుంట గ్రామానికి చెందిన హరి అనే వాలంటీర్ తమ కూతురిని కిడ్నాప్ చేశాడని బాలిక తల్లి తిమ్మక్క ఆరోపించింది. వారం రోజుల నుంచి తమ కూతురు కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమీప బంధువులు, కాలనీవాసులను తన బిడ్డ ఆచూకీ గురించి విచారిస్తే... హరి తన కూతురితో చునువుగా ఉండేవాడని తెలిపినట్లు చెప్పింది. ఈ విషయంపై హరిని ప్రశ్నిస్తే... తనకు ఏమీ తెలియదని సమాధానం ఇచ్చాడని తెలిపింది. సమీప బంధువుకు తమ కుమార్తె ఫోన్ చేసి హరిని వివాహం చేసుకుందని చెప్పినట్లు తెలిసిందన్నారు. దీనిపై దిశ పోలీసు స్టేషన్ కు వెళ్తే కేసు తీసుకోవడానికి నిరాకరించారని వివరించింది. ఎస్పీ ఆఫీస్ కు వెళ్తే... ఫిర్యాదుల సమయం ముగియడంతో మంగళవారం రావాలని సూచించారని తిమ్మక్క ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులే తనకు న్యాయం చేయాలని కోరింది.
'గ్రామ వాలంటీర్ మా కూతురిని కిడ్నాప్ చేశాడు..మీరే కాపాడాలి' - girl kidnap in anantapur
గ్రామ వాలంటీర్ తమ కుమార్తైకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని అనంతపురం జిల్లా కురుగుంట గ్రామానికి చెందిన ఓ మహిళ ఆరోపించింది. 15 సంవత్సరాలున్న తమ కూతురుని తనకు దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరారు.
Breaking News