అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. టిడ్కో గృహాలకు డిపాజిట్ చెల్లించిన వారందరికీ వెంటనే గృహాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు , గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడువు లోపల పేదల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
టిడ్కో ఇళ్లలను లబ్ధిదారులకు కేటాయించాలి - CPI protested seeking allocation of Tidco houses to beneficiaries
టిడ్కో ఇళ్లలను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కోరుతూ...సీపీఐ నాయకులు సామూహిక దీక్ష చేపట్టారు. గడువు లోపల పేదల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
సీపీఐ నాయకులు సామూహిక దీక్ష