అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో విషాదం నెలకొంది. పట్టణంలోని కుటాగుళ్లకు చెందిన లక్ష్మీ అనే వివాహిత.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన లక్ష్మీ చాలా సమయమైన బయటకు రాలేదని.. అనుమానంతో తలుపులు పగల గొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటికే మృతి చెందిందని పోలీసులకు సమాచారం ఇవ్వగా... వారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య - Anantapur district latest news
ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణ కుటాగుళ్లలో చోటు చేసుకుంది.
ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య