భార్య మృతిని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువులో జరిగింది. నల్లచెరువు చెందిన రెడ్డి శేఖర్ భార్య షాహిద్.. అనారోగ్యంతో మూడు నెలల కిందట మరణించింది.
అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉంటున్న రెడ్డిశేఖర్.... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.