అనంతపురం నగరంలోని సప్తగిరి కూడలి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వెంకటరమణ అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రుడుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మున్నానగర్కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై అతివేగంతో రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు పెనుకొండలోని పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి - bike accident in Anantapur news
అనంతపురంలో పాదచారుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు.
![ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి bike accident in Anantapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9471499-607-9471499-1604770032565.jpg)
bike accident in Anantapur