అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం వద్ద ట్రాక్టర్ ఢీకొని లేపాక్షి నాయుడు(55) అనే వ్యక్తి మృతి చెందాడు. గుట్టకిందపల్లి కాలనీకి చెందిన ఆయన కాలినడకన ప్రధాన రహదారిపై వెళుతుండగా వంటచెరుకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లేపాక్షి నాయుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వారు... హైదరాబాద్ నుంచి ధర్మవరం వచ్చేందుకు అధికారుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ధర్మవరంలో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణమైన వావానాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.
A man was killed in a road accident