మూడు అంతస్తుల భవనంలో 35 ఏళ్ల చెట్టు! - వృక్షో రక్షతి రక్షితః
వృక్షో రక్షతి రక్షితః అన్న పెద్దల మాటను పాటిస్తున్నారు అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి చెందిన శివ ప్రసాద్. విశ్వ భారతి పాఠశాల కరస్పాండెంట్ అయినా ఈయన... చెట్లపై తన ప్రేమను చాటుతున్నారు. 35 సంవత్సరాల వయసు ఉన్న కొబ్బరి చెట్టును నరికివేయడం ఇష్టం లేక దాని చుట్టూ ఇంటిని నిర్మించున్నారు. ఆ చెట్టు వల్ల భవనానికి ముప్పు వాటిల్లుతుందని, వాస్తుకు అడ్డంకి అని కొందరు చెప్పినా... దానిని సంరక్షించుకుంటున్నారు. ఈ భవనం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది.