ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - రాయదుర్గంలో అక్రమ మద్యం స్వాధీనం

అనంతపురం జిల్లా రాయదుర్గంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొలకాల్మురు చెక్​పోస్టు వద్ద పోలీసులు వాహన తనీఖీలు చేపట్టగా.. 21 బాక్సుల్లో మద్యాన్ని తరలిస్తున్న మినీ వ్యానును గుర్తించి సీజ్ చేశారు. వ్యాను డ్రైవర్​ను అరెస్టు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

By

Published : Apr 24, 2021, 5:43 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని మొలకాల్మూరు చెక్​పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. భారీ ఎత్తున కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మొలకాల్మురు పట్టణం నుంచి రాష్ట్రానికి ఓ మినీ వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 21 బాక్సులు, (1968 ప్యాకెట్లు) మద్యం ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు.

డ్రైవర్ మహారాజును అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు రాయదుర్గం యూపీఎస్ సీఐ వీరన్న తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని చెప్పారు. అరెస్టు చేసిన డ్రైవర్​ను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details