ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..! - ధర్మవరం పాత రైల్వే క్వార్టర్స్​లో వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పాడుబడిన రైల్వే క్వార్టర్స్​లో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు ఆత్మకూరు గ్రామానికి చెందిన అశోక్​గా గుర్తించారు. ఇటీవల భార్యతో వివాదం కారణంగానే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిస్తోంది.

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jan 28, 2020, 10:47 AM IST

భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పాడుబడిన రైల్వే క్వార్టర్స్​లో అశోక్​ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చికెన్ కబాబ్ సెంటర్ నిర్వహిస్తూ అశోక్​ తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో ఇటీవల భార్యతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీనిపై కలత చెందిన అశోక్​ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details