తన పేరు మీద ఉన్న ఇంటి పట్టా మరొకరికి కేటాయిస్తున్నారంటూ అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తన సమస్య పరిష్కరించాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ఎదుటే నాగరాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకుని... అతనిపై కేసు నమోదు చేశారు.
తన ఇంటి పట్టా మరొకరికి కేటాయిస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లాలో నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన ఇంటి పట్టా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
a-man-suicide-attempt-in-ananthapuram