రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తున్న వేళ ఓ వ్యక్తి, అధికారుల కళ్లుగప్పి.. తపాలాశాఖలో పోస్టుమాన్, అటు నగరపాలక సంస్థ సచివాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నాడు. తపాలాశాఖలో పోస్టుమాన్, అటు నగరపాలక సంస్థ సచివాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురం నగరం జార్జిపేట తపాలా కార్యాలయంలో పోస్టుమాన్ ఉద్యోగి ఒకరు ఇటీవలే నగరపాలక సంస్థ సచివాలయంలో ఉద్యోగానికి అర్హత సాధించాడు. అధికారులకు తెలియకుండా తరచుగా సెలవులు పెట్టి రెండు ఉద్యోగాల్లోనూ కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తపాలా కార్యాలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధినిర్వహణలో ఉండాలని నిబంధన ఉంది. ఈ విషయంపై జార్జిపేట పోస్టుమాస్టరు రాఘవయ్య మాట్లాడుతూ.. పోస్టుమాన్ ఇటీవలే రెండ్రోజులు సెలవుపై వెళ్లాడని, మళ్లీ సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాడన్నారు. పోస్టుమాన్ సెలవులో ఉన్నపుడు మరో ఉద్యోగితో పోస్టు బట్వాడా జరిగేలా చూస్తున్నామన్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.
అధికారుల కళ్లుగప్పి రెండు ఉద్యోగాలు.. - రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఓ వ్యక్తి
అసలే నిరుద్యోగం పెరిగిపోతోంది.. నిరుద్యోగులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఏకంగా రెండు పోస్టుల్లో కొనసాగుతూ.. రెండు చోట్ల ఆదాయాలు పొందుతూ.. ప్రభుత్వాన్ని మోసం చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.
అధికారుల కళ్లుగప్పి రెండు ఉద్యోగాలు..