అనంతపురంలోని మల్లేశ్వర రోడ్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ రావు.... ఇంటిలో దాదాపు 50 పిల్లులను పెంచుతున్నారు. చిన్న వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన... పిల్లులకు నిత్యం పాలు, మాంసాహారం అందిస్తూ వాటికి సపర్యలు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కుక్కల దాడిలో గాయపడిన ఓ పిల్లిని ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నారు. కొన్ని రోజులకు అది మరణించటంతో ఆ బాధను మర్చిపోయేందుకు మరో పిల్లిని తెచ్చుకున్నారు. దానికి సంతానం కలిగి ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లుల సంఖ్య దాదాపు 50కి చేరింది.
ఆ ఇంట్లో మనుఘల కంటే పిల్లులే ఎక్కువ! - అనంతపురం జిల్లా వార్తలు
పిల్లి ఎదురొస్తే అపశకునం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అనంతపురంలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 50 పిల్లులను పెంచుకుంటున్నారు. వాటికి నిత్యం పాలు, మాంసం అందిస్తున్నారు.
cat man
పిల్లులను తన ఇంటి సభ్యులులాగా చూసుకుంటున్నారు వేణుగోపాల్. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యులకు చూపిస్తున్నారు. వారి సూచనలతో పిల్లులకు ఇంట్లోనే వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పిల్లుల పెంపకంతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని వేణుగోపాలరావు తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా నివారణకు కేంద్రం 15 సూచనలు