ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి... ఆందోళనకు దిగిన బంధువులు - అనంతపురంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మృతి చెందటంతో బంధువులు ఆందోళనకు దిగారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

a man dies suddenly after operation at ananthapur
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

By

Published : Feb 19, 2020, 6:47 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్​కు ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి చేయి విరిగింది. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా... ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చిన అనంతరం మంగళవారం శస్త్రచికిత్స చేశారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేయగా... ఎంతసేపటికి స్పృహలోకి రాలేదు. విషయం తెలియడంతో బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. మాసివ్ ఎమ్​ఐ వల్ల చంద్రశేఖర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఇదీ చదవండి:వ్యక్తి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details