విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన యువకుడు... విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తిరుమల దేవరపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రామిరెడ్డి అనే యువకుడు మరమ్మతు కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు. షాక్ కొట్టి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి - man died due to electric shock and fell down in ananthapur district
విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన తిరుమల దేవరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో కరెంట్ స్తంభం నుంచి కిందపడి యువకుడు మృతి