ద్విచక్ర వాహనం పై వెళ్తున్న కోదండ రామయ్య అనే వ్యక్తి... రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ని ఢీకొట్టిన ఘటనలో.. తీవ్ర గాయాలపాలై మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం యు. రంగాపురం గ్రామం వద్ద జరిగింది. మృతుడిని రామయ్యగా గుర్తించారు. అతనికి భార్య, పాప ఉన్నారు. ప్రస్తుతం ఆమె భార్య గర్భవతి.
బేరింగ్ పాడవగా.. ట్రాక్టర్ ను డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అది గమనించని రామయ్య ... వేగంగా వచ్చి ఢీ కొట్టి చనిపోయాడని స్థానికులు చెప్పారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి... ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.