అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం సోమలాపురం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఫక్రుద్దీన్.. సోమలాపురం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గార్మెంట్స్ కార్మికుడిగా సౌత్ వెస్ట్రన్ రైల్వే పోలీసులు గుర్తించారు. భార్యభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో ఫక్రుద్దీన్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు. హుబ్లీ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య - అనంతపురం జిల్లా సోమలాపురం వద్ద వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనా అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం సోమలాపురం వద్ద జరిగింది.
![రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య man commits suicide by falling off train](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11233261-113-11233261-1617244787555.jpg)
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య