A man brutally murdered at Anantapur: అనంతపురం రూరల్ కామరపల్లి సమీపంలో రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొడవలితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాపీ పని చేసే రాజేష్‌కు.. కొన్నేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై గతంలో గొడవలు కూడా జరిగాయని స్థానికులు అంటున్నారు.
ఉదయం పనికి వెళ్లే సమయంలో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.