అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నూరుకు చెందిన కలికి సూరి భవన నిర్మాణ కార్మికుడు… అంజి అనే వ్యక్తి చేనేత కార్మికుడు. సూరి పట్టణంలోని సంజయ్ నగర్ వద్ద భవన నిర్మాణ పనులు చేస్తుండగా… అంజి అక్కడికి వచ్చి కత్తితో దాడి చేశాడు. గాయపడిన సూరిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి..ఆరా తీశారు. అంజి భార్యతో సూరి చనువుగా ఉంటున్నాడని అనుమానం పెంచుకొని... దాడి చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
భార్యతో చనువుగా ఉంటున్నాడని వ్యక్తిపై కత్తితో దాడి - కత్తితో వ్యక్తి దాడి
తన భార్యతో మరో వ్యక్తి చనువుగా ఉంటున్నాడని సందేహించిన భర్త అతనిపై కత్తితో దాడి చేశాడు. బాధితుడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు స్థానికులు.
భార్యతో చనువుగా ఉంటున్నాడని వ్యక్తిపై అనుమానం-కత్తితో దాడి