ప్రపంచాన్ని కరోనా భయపెడుతుంటే... అనంత జిల్లా గుంతకల్లులో మాత్రం మహిళలు ఓ పోకిరి చేష్టలతో భయబ్రాంతులకు గురవుతున్నారు. రైల్వేలో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించే తిరుపతి అనే వ్యక్తి... మహిళల ఫొటోలను దొంగచాటుగా తీసేవాడు. వాటిపై అసభ్యపదజాలతో కూడిన భాషను రాసి... వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచేవాడు. ఇలాంటి అసభ్యకరమైన పోస్టింగులతో విసుగెత్తిన జనం చివరికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆకతాయిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పీఎస్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
గుంతకల్లులో కామాంధుడికి దేహశుద్ధి - kamandhudiki dehashudhi gunthakallu
ఆరు బయట ముగ్గు వేసే వారైనా, కళ్లాపు చల్లే వారైనా.. మార్కెట్ లో కాయగూరలు అమ్మే వారైనా.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే వారైనా... ఇలా ఏ మహిళైన సరే అతని లక్ష్యం ఒక్కటే... వారి చిత్రాలను తీయటం. వాటిపై అసభ్య పదజాలం రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేయటం... రాక్షసానందం పొందటం. ఇది అనంత జిల్లా గుంతకల్లులో ఓ దుర్మార్గుడి దిన చర్య.
గుంతకల్లులో ఓ కామాందుడికి దేహశుద్ది