A husband killed his wife out of suspicion : కనగానపల్లి ప్రాంతానికి చెందిన బోయ రాజప్ప అతని భార్య సావిత్రమ్మ ఉపాధి నిమిత్తం అనంతపురంలోని తపోవనం సర్కిల్ సమీపంలో హాసన్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా విధులు నిర్వహించేవారు. భార్య, భర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్దాలతో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి రాత్రి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదన జరిగింది. సావిత్రి తలపై మొదట ఇటుకతో కొట్టి పక్కనే ఉన్న కొడవలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయమై సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. రాజప్ప భార్యపై అనుమానం పెంచుకోవడంతోనే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
husband killed his wife: భార్యపై అనుమానంతో ..కత్తితో దాడి చేసి హత్య చేసిన భర్త - కత్తితో దాడి చేసి హత్య చేసిన భర్త
husband killed his wife : అనుమానంతో భార్యను చంపిన ఘటన అనంతపురంలోని తపోవనం సర్కిల్ సమీపంలో జరిగింది. భార్య,భర్తల మధ్య చిన్నగా మొదలైన గొడవలో మాట మాటా పెరిగింది. చివరకు కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య తలపై ఇటుకతో కొట్టి.. ఆపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలైన ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది.
భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త
Last Updated : Sep 17, 2022, 5:20 PM IST