A huge fraud in the name of Loan app : అనంతపురం జిల్లాలో తక్కువ వడ్డీకే రుణాల పేరిట అమాయకుల్ని మోసం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మాసే మునీంద్ర అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు, తండ్రి, తల్లి తదితర కుటుంబసభ్యుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనంతపురంలో, ఎల్.డీ ఆర్.కే నిధి లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.
కొంతమంది ఉద్యోగుల్ని చేర్చుకుని... వారి ద్వారా వినియోగదారులతో 500 రూపాయలతో ఖాతాలు తెరిపించాడు. తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తామని చెప్పి, అందుకు 5 వేల రూపాయల నగదు అవసరమని, అందరి చేత డిపాజిట్ చేయించాడు. ఈ లావాదేవీల కోసం ఎల్.డీ ఆర్.కే నిధి అనే మొబైల్ యాప్‌ను రూపొందించాడు. డబ్బులు కట్టిన నగరానికి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి తన ఖాతాలోని 70 వేలు డ్రా చేసేందుకు యత్నించాడు.