పని భారం తట్టుకోలేక అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే.... పరిగిలో మరొకరు మృత్యువాత పడ్డారు. విట్టాపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సుబ్రహ్మణ్యం విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలో పని ఉందని శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన.... పరిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వెనక ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడు. నాడు నేడు పనుల ఒత్తిడి తట్టుకోలేకే... ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పని ఒత్తిడి భరించలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య - విట్టాపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య
పని ఒత్తిడి తాళలేక ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం అనంతపురం జిల్లా పరిగిలో జరిగింది.

పని ఒత్తిడి భరించలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య !
Last Updated : Dec 13, 2020, 4:06 AM IST