Gas cylinder lorry overturned: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో గురువారం గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీని వెనెక్కి మళ్లించే సమయంలో.. వెనక టైర్లు పక్కనే ఉన్న కాలువలోకి దిగడంతో ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న 342 గ్యాస్ లిండర్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. స్థానికులు గ్యాస్ ఏజెన్సీకి సమాచారమిచ్చారు. ఏజెన్సీ వారు అక్కడకు చేరుకుని సిలిండర్లను వెంటనే లారీ నుంచి వేరొక వాహనంలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.
గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా... తప్పిన పెను ప్రమాదం - రాయదుర్గం గ్యాస్ లారీ ప్రమాదం
Gas cylinder lorry overturned: గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేస్కుంది. డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. స్థానికులు ఘటన సమాచారాన్ని గ్యాస్ ఏజెన్సీకి తెలియజేశారు. ఏజెన్నీ వారు సిలిండర్లను లారీ నుంచి వేరొక వాహనంలోకి తరలించారు. లారీ బోల్తా పడిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

గ్యాస్ లారీ ప్రమాదం