ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నానపు గది గోడ కూలి బాలుడు మృతి - ap latest news

స్నానపు గది గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కొత్తచెరువులోని ఇసుకవంక వీధిలో జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా మృతి చెందడంపై.. కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి
five years old boy died in anantapur district

By

Published : Apr 12, 2021, 10:32 AM IST

అనంతపురం జిల్లా కొత్త చెరువులోని ఇసుకవంక వీధిలో స్నానపు గది గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. చంద్ర, సుజాతల రెండవ కుమారుడు యజుర్వేద (5) ఆదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ స్నానపు గది గోడ కూలింది. గోడ శిథిలాలు బాలుడి మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రమైన రక్తస్రావంతో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details