ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టుచీరల దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.30 లక్షల మేర నష్టం - అనంతపురం

గుంతకల్లు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద పట్టు చీరల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపారు.

fire broke
అగ్నిప్రమాదం

By

Published : Aug 4, 2021, 5:24 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద పట్టు చీరల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు నెలల క్రితం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి సిల్క్స్ షాప్​లో ఉదయం పొగలు రావడం గమనించిన స్థానికులు.. షాపు యజమాని పరమేష్​కు సమాచారం అందించారు. వెంటనే వచ్చి ఆయన షాపు తలుపులు తెరిచి చూడగా అప్పటికే మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు పక్కనున్న దుకాణాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షాపులో ఉన్న మొత్తం చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేయడంతో మొత్తం చీరలన్నీ కాలిపోయాయని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనలో 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details