ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Young farmer: ఎనిమిదిన్నర గంటల్లో.. 18 ఎకరాల అంతర సేద్యం! - latest news in anantapur district

ఓ యువ రైతు ఎద్దులతో 8 గంటల 30 నిముషాల్లో 18 ఎకరాల పంటలో అంతర సేద్యం చేశారు. కేవలం రెండు ఎద్దులతో.. అంత తక్కువ సమయంలో సేద్యాన్ని పూర్తి చేయటంపై స్థానిక రైతులు అభినందనలు కురిపించారు. అలాగే యువరైతును పూలమాలలతో సత్కరించారు.

young farmer
యువ రైతు సిద్ధప్ప

By

Published : Aug 24, 2021, 1:57 PM IST

అతి తక్కువ సమయంలో అంతర సేద్యం చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు ఓ యువ రైతు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన సిద్ధప్పకు వృషభాలు, వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. 18 ఎకరాల కంది పంటలో ఒకే రోజులో అంతర సేద్యం చేయాలనుకున్నాడు సిద్ధప్ప.

అందుకు గ్రామానికి చెందిన రామదాసు పొలాన్ని ఎంచుకున్నాడు. ఉదయం 5 గంటలకు సేద్యం ప్రారంభించి, మధ్యాహ్నం 1:30 గంటలకు పూర్తి చేశాడు. సాధారణంగా ఒకే రోజులో అంత పొలంలో అంతర సేద్యం చేయాలంటే కనీసం 4 జతల ఎద్దులతో పని చేయాల్సి ఉంటుంది. ఒక జత ఎద్దులతో అయితే కనీసం ఈ పనికి 4 రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపాడంటూ.. సిద్ధప్పను గ్రామస్థులు పూలమాలలతో సత్కరించి.. అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details