అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో పంట పొలంలోనే రైతు విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందాడు. రైతు ఆంజనేయులు శనివారం సాయంత్రం విద్యుత్ మోటార్ ఆన్ చేయడానికి వెళ్లి తిరిగిరాకపోయేసరికి …కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్న రైతును చూసి కన్నీరుమున్నీరయ్యారు.
విద్యుత్ ఘాతానికి గురై అనంతపురంలో రైతు మృతి - ఏపీ తాజా
మరో రైతు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. రెండు రోజుల క్రితమే కడపజిల్లాలో నలుగురు రైతులు విద్యుత్ ఘాతానికి గురై చనిపోయిన ఘటన మరువకు ముందే, అనంతపురంలోను అలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యుత్ మోటార్ వేసేందుకు వెళ్ళిన ఓ రైతు తిరిగిరాని లోకాలకు వెళ్లడం, ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
అనంతపురంలో విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి