అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో వివాదం చెలరేగి.. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ..ఏడుగురికి గాయాలు - TDP and ycp leaders clash news in Anantapur district
అనంతపురం జిల్లాలో తెదేపా, వైకాపా నేతల మధ్య వివాదం జరిగింది. వినాయక నిమజ్జనం ఉరేగింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ
రెండు వర్గాలకు చెందిన వినాయక విగ్రహాలు ఊరేగింపు సమయంలో వైకాపా నాయకులు తెదేపా నేతలతో వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. అనంతరం గ్రామంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి