అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏసీఎస్ మిల్లు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 20 వసంతాల సందర్భంగా పూర్వపు విద్యార్థులు గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తల్లికి ఎంత గౌరవం ఇస్తామో.. అంతకంటే ఎక్కువగా మాతృభాషను గౌరవించాలని సూచించారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్దాశ్రమానికి పంపి మానవత్వాన్ని మంటగలపొద్దని కోరారు. అనంతరం పూర్వపు విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి 10 వేల రూపాయలను హెచ్ఎం ప్రమీలకు అందజేశారు.
పూర్వ విద్యార్ధుల సమ్మేళనం... గురువులకు సన్మానం.. - honore to teachers at ananthapuram latest news
అనంతపురం జిల్లా గుంతకల్లులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 20 వసంతాలు పూర్తైన సందర్భంగా అప్పటి విద్యార్థులు గురువులను ఘనంగా సన్మానించారు. తల్లికి ఎంత గౌరవాన్ని ఇస్తామో అంతకంటే ఎక్కువగా మాతృభాషను గౌరవించాలని ఉపాధ్యాయులు సూచించారు.

గుంతకల్లులో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం