అనంతపురం జిల్లా హిందూపురంలో రాత్రి కురిసిన వర్షానికి సద్భావన కూడలిలో ఉన్న పురపాలక సంఘం వాణిజ్య భవనాల సముదాయం వద్ద ప్రహారీ గోడ కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. వాణిజ్య సముదాయాల భవనం పురాతనమైంది కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కూలిన ప్రహారీ... అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ - anantapur district latest news
అనంతపురం జిల్లా హిందూపురంలోని సద్భావన కూడలిలో పురపాలక సంఘం వాణిజ్య భవనాల సముదాయం ప్రహారీ గోడ కూలిపోయింది. పురాతనమైనది కావటంతో రాత్రి కురిసిన వర్షానికి పడిపోయింది.
కూలిన గోడ
భవన పరిస్థితిపై ఇటీవలే కిరాయిదారులకు నోటీసులు అందించామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. అయినప్పటికీ ప్రహారీ గోడకు బరువైన హోర్డింగులు తగిలించటం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు మరమ్మతులు చేయటంలో నిర్లక్ష్యం వహించటం వల్లే ఘటన జరిగిందని దుకాణదారులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:బస్సు ఢీ, వ్యక్తికి గాయం.. ఆస్పత్రులు చేర్చుకోవడం లేదంటూ బాధితుడి భార్య ఆందోళన