రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులకు ఎలుగుబంటి కనబడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పశు వైద్య కళాశాల సమీపంలో హంద్రీనీవా కాలువ పక్కన ఎలుగుబంటి సంచరించింది. అటువైపుగా రోడ్డుపై వెళ్తున్న వాహనచోదకులు దాన్ని చూసి అవాక్కయ్యారు. చాలా మంది నిలబడి చూస్తున్నా.. అది అక్కడి నుంచి కదల్లేదు. చాలాసేపటి తరువాత అక్కడినుంచి వెళ్లిపోయింది.
రోడ్డు పక్కన ఎలుగుబంటి సంచారం.. తిలకించిన వాహనదారులు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
మడకశిర పశు వైద్య కళాశాల సమీపంలోని హంద్రీనీవా కాలువ పక్కన ఎలుగుబంటి సంచారంతో వాహనచోదకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

రోడ్డు పక్కన ఎలుగుబంటి సంచారం
Last Updated : Jun 20, 2021, 1:33 PM IST