ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానోపాధ్యాయురాలుగా తొమ్మిదో తరగతి విద్యార్థి - 9th class student as one day hm in anantapur district

సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా అమరావతి మండలం గౌడనకుంటలోని పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒక్కరోజు ప్రధానోపాధ్యాయురాలిగా నియమించారు.

one day hm
ప్రధానోపాధ్యాయురాలుగా తోమ్మిదో తరగతి విద్యార్థి

By

Published : Jan 5, 2021, 4:27 AM IST

అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సావిత్రిబాయి పూలె జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్.వెన్నెల సాయిని ఒక్కరోజు ప్రధానోపాధ్యాయురాలుగా నియమించారు. అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని మరింత పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తనకు ఈ అవకాశం వచ్చేలా చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాన్, ఇతర గురువులకు వెన్నెలసాయి కృతజ్ఞతలు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details