అనంతపురం జిల్లా కనేకల్లు మండలం ఉడేగోళం గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా.. రాత్రంతా గొర్రెలు తడిసిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేని మూగజీవాలు ప్రాణాలు విడిచాయి. కన్నబిడ్డల్లా చూసుకుంటున్న గొర్రెలు కళ్లెదుటే మరణించిన పరిస్థితుల్లో వాటి యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 9 లక్షల మేర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి - sheep's
అనంతపురం జిల్లా ఉడేగోళం గ్రామంలో 96 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 9 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వాటి యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
![అనంతపురం జిల్లాలో భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3648760-226-3648760-1561377986400.jpg)
భారీ వర్షానికి 96 గొర్రెలు మృతి
Last Updated : Jun 24, 2019, 7:24 PM IST