ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వైన్ ఫ్లూతో 9 నెలల గర్భిణి మృతి - స్వైన్ ఫ్లూతో 9 నెలల గర్భిణీ మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి స్వైన్ ఫ్లూ వ్యాధితో మృతి చెందింది. ఫ్లూ జర్వంతో వారం రోజులుగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా... వ్యాధి తీవ్రమై బుధవారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించినట్టు వైద్యులు చెప్పారు.

స్వైన్ ఫ్లూతో 9 నెలల గర్భిణీ మృతి

By

Published : Sep 26, 2019, 7:14 PM IST

స్వైన్ ఫ్లూతో 9 నెలల గర్భిణీ మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. స్వైన్ ఫ్లూ జ్వరం.. ప్రాణాన్ని బలి తీసుకుంది. తొమ్మిది నెలల నిండు గర్భిణి స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందింది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మహిళకు వారం కిందట జ్వరం సోకింది. స్థానిక ఆసుపత్రుల్లో వైద్యం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా జ్వరం తగ్గకపోవడం వలన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థరించారు. బాధితురాలని పరిస్థితి మరింత విషమించడం వలన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ విభాగానికి తరలించారు. వ్యాధి తీవ్రమై బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు మహిళ భర్త తెలిపాడు. కడుపులోని బిడ్డ కూడా చనిపోయినట్టు వైద్యులు తెలిపారన్నాడు.

ABOUT THE AUTHOR

...view details