ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Free Fire Game: సెల్​ఫోన్లో గేమ్ కు బానిసయ్యాడు.. మెడ నరాలు చిట్లిపోయి ఏమైందంటే?

Free Fire Game: సెల్ ఫోన్​లో అదేపనిగా ఫ్రీ ఫైర్ ఆట ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ విద్యార్థి. ఆటకు విపరీతంగా అలవాటుపడిపోయి నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న అతడు.. తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు.

8th-class-student-go-to-comma-while-playing-free-fire-game
విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన ఫ్రీ ఫైర్ ఆట..!

By

Published : Dec 5, 2021, 10:47 AM IST

Updated : Dec 5, 2021, 9:13 PM IST

నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు

Free Fire Game: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి అదే పనిగా సెల్​ఫోన్​లో ఫ్రీ ఫైర్ ఆట ఆడుతున్నాడు. ఇలా దాదాపు మూడు నెలల నుంచి అదేపనిగా ఆడుతున్నాడు. ఎంతలా అంటే.. ఎవరు పిలుస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఆటలోనే మునిగిపోయేలా తయారయ్యాడు. ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద సృహతప్పి పడిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. కుమారుడి పరిస్థితి చూసి ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. ఫోన్లో గేమ్ కు బానిసై, నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు.

"మా కుమారుడు ఎప్పుడు చూసినా పబ్బీ (ఫ్రీఫైర్) గేమ్​ ఆడుతాడు. రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఆడుతుంటాడు. అయితే.. వారం క్రితం తలనొప్పివస్తోందని చెప్పాడు. దాంతో ఆసుపత్రికి తీసుకెళ్లాము. మళ్లీ ఇవాళ తిరుపతిలోని ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు. తింటున్నాడు. కానీ ఇంకా మమల్ని గుర్తుపట్టట్లేదు."

- విద్యార్థి తండ్రి

"రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జామువరకు ఆడుతుంటాడు. మా ఇద్దరు కుమారులు సెల్​ఫోన్​ విషయమై గొడవ పడుతుంటారు. మూడునెలల నుంచి మా కుమారుడు సెల్​లో పబ్జీ (ఫ్రీ ఫైర్​)గేమ్​ ఆడుతున్నాడు. తలనొప్పిగా ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇప్పుడు మా కుమారుడు మమల్ని గుర్తుపట్టట్లేదు."

- విద్యార్థి తల్లి

ఇదీ చూడండి:పబ్​జీ ఆడుతూ గుండెపోటుతో బాలుడు మృతి

Last Updated : Dec 5, 2021, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details