అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వినాయక సర్కిల్ వద్ద రహదారిపై 8 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రాంతంలో నాలుగు పెద్ద సొరంగ మార్గాలు ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజుల కాలంలో శత్రువుల నుంచి రక్షణ పొందడానికి వినాయక సర్కిల్ నుంచి రాయదుర్గం కొండపై గల కోటలోకి సొరంగ మార్గాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
రహదారిపై రంధ్రం.. సొరంగ మార్గమంటున్న స్థానికులు - అనంతపురం జిల్లాలో రాయదుర్గం తాజా వార్తలు
అనంతపురం జిల్లా రాయదుర్గం రహదారిపై 8 అడుగుల మేర రంధ్రం ఏర్పడింది. గతంలోనూ ఇలాంటి రంధ్రాలు ఏర్పడి సొరంగాలు బయటపడటంతో.. చరిత్ర ఆనవాలున్న రాయదుర్గాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.
రహదారిపై రంధ్రం
కొండపై నేటికి పూరాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నట్లు తెలిపారు. అప్పటి సొరంగ మార్గాలు, కందకాలు ఇలా ఇప్పుడు బయట పడుతున్నాయంటున్నారు. అయితే రహదారిపై గొయ్యి ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు గొయ్యి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి...
విమానాశ్రయ పునరుద్ధరణకు సన్నాహాలు!
Last Updated : Dec 9, 2020, 2:31 PM IST