ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోదీ రాక అవసరం'

మోదీ పాలనలో భారత్ అవినీతి నిర్మూలన దిశలో ప్రపంచ దేశాల్లో ముందుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్ఫోన్స్ జోసెఫ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీనే అధికారంలోకి రావడం దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.

8కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు విడుదల చేశాం

By

Published : Mar 1, 2019, 2:35 PM IST

Updated : Mar 1, 2019, 3:53 PM IST

8కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు విడుదల చేశాం
మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అవినీతి తగ్గిందని, అభివృద్ధిలో పరుగులు పెడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఆల్ఫోన్స్ జోసెఫ్ అభిప్రాయపడ్డారు.వందశాతం విద్యుదీకరణ చేశామని తెలిపారు. జీఎస్టీతో దేశాన్ని ఒక వ్యవస్థకు తీసుకొచ్చామని, ఆదాయ పన్ను శాఖలో అనేక సంస్కరణలు చేపట్టామని వివరించారు. దేశంలో 8కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు విడుదల చేసినట్లు జోసెఫ్ తెలిపారు. అనంతపురంలో జరిగిన యువ ఓటర్ల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
Last Updated : Mar 1, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details