- శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట
Srikalahasti Temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భక్తులు భారీగా తరలి రావడంతో వారి మధ్య తోపులాట జరిగింది.
- ఆ వివరాలు అడిగారని మరుగుదొడ్డిని కూల్చేశారు... అంతటితో ఆగకుండా..
Land occupation: రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో ఓ ఇంటి మరుగుదొడ్డిని పడగొట్టారు. అంతేగాకుండా ఆ స్థలం పంచాయతీకి సంబంధించినదిగా బోర్డు పెట్టారు. పంచాయతీకి సంబందించిన వివరాలను సమాచార హక్కు చట్టంలో అడిగినందుకే ఈ చర్యకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
- తెనాలి ప్రభుత్వాస్పత్రిలో ప్లాస్టిక్ వేలి ముద్రలతో హాజరు.. ఇద్దరిపై వేటు
Plastic finger prints: ప్రభుత్వ ఉద్యోగుల పని తీరులో పారదర్శకత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు.. అనే సామెత ఇదిగో ఇలాంటి వాళ్లను చూసి పుట్టినట్లుంది. ఆసుపత్రిలో హాజరు కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేశారు. అందులోని లోపాలను ఆధారంగా చేసుకుని ప్లాస్టిక్ వేలి ముద్రలతో హాజరును వేసుకుంటున్నారు ఇద్దరు వైద్యులు. వారి మధ్య గొడవ రావడంతో విషయం బయటకు వచ్చింది. ఆ ఇద్దరికి నోటీసులు ఇవ్వగా... వారికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.
- స్టెప్పులేసిన కేఏ పాల్.. వీడియో వైరల్
KA Paul Dance Video Viral: తెలంగాణ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మునుగోడు ప్రజలతో కలిసి నృత్యం చేసి అలరించారు. ప్రజాశాంతి పార్టీ గీతానికి స్టెప్పులేసిన వీడియో..ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- ల్యాప్‌టాప్ బుక్ చేస్తే రాయి వచ్చింది.. పార్సిల్ ఓపెన్ చేసి ఖంగుతిన్న వినియోగదారుడు
కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ కామర్స్ వెబ్సైట్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేయగా.. పార్సిల్ కవర్లో రాయి, కొంత ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద తన డబ్బును తిరిగిపొందాడు.
- 'ఇలానే చేస్తే మరిన్ని ఫొటోలు పోస్ట్ చేస్తా'.. లైంగిక వేధింపులపై మాజీ స్పీకర్‌కు స్వప్న సవాల్
కేరళ మాజీ స్పీకర్, ఇద్దరు మాజీ మంత్రులు తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన స్వప్నా సురేశ్.. తాజాగా స్పీకర్ శ్రీరామకృష్ణన్ ఫొటోలు విడుదల చేసింది. 'సార్ ఇదే మీకు నా సమాధానం' మీకు ధైర్యం ఉంటే నాపైన పరువు నష్టం కేసు పెట్టాలని.. ఫేస్బుక్ ద్వారా సవాలు విసిరింది.
- ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్.. తిరిగి హోం సెక్రటరీగా బ్రేవర్మన్.. బ్రిటన్ మంత్రివర్గ విస్తరణ
బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే రిషి సునాక్ తన పనిని ప్రారంభించారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు.
- ప్లే స్టోర్‌లో గూగుల్ 'మాయ'.. రూ.936కోట్లు ఫైన్ వేసిన భారత్
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్ ఇచ్చింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్లే స్టోర్ విషయంలో అక్రమాలకు పాల్పడిందని నిర్ధరిస్తూ రూ.936.44కోట్లు జరిమానా విధించింది.
- అదరగొట్టిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. టాప్-5లోకి ఎంట్రీ
స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనత సాధించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. సింధూతో పాటు డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ క్యాటగిరీల్లో కూడా భారత షట్లర్లు సత్తా చాటారు.
- ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే.. డేట్ నోట్ చేసుకోండి!
దసరా, దీపావళి సందర్భంగా పెద్ద సినిమాల జోరు కనిపించింది. ఇప్పుడు చిన్న చిత్రాల జాతర మొదలైంది. పలు చిన్న చిత్రాలు థియేటర్, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏ సినిమా ఎందులో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..
ఏపీ ప్రధాన వార్తలు @ 7 AM