అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్ ఆసుపత్రికి రూ. 6.5 లక్షల విలువైన పరికరాలను సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్, వైకాపా పార్లమెంట్ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ అందజేశారు. కరోనా వైరస్ బారినపడిన రోగులకు శక్తినిచ్చే పానీయాలను(ఎనర్జి డ్రింక్స్), మందులను జిల్లా సంయుక్త పాలనాధికారి సిరి ఆధ్వర్యంలో వైద్యులకు అందించారు.
ఈ సందర్భంగా జేసీ సిరి మాట్లాడుతూ... వైరస్ నిర్మూలన కోసం దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొవిడ్ ఆస్పత్రికి అవసరమైన పరికరాలను అందించారని గుర్తుచేశారు.