సంక్రాంతి సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి గ్రామీణ పరిధిలో కోడి పందేలు ఆడుతున్న 55మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు తలుపుల, తనకల్లు మండలాల్లోని బరుల్లో పోలీసులు సోదాలు చేసి.. పందెం కాస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో కోడి కత్తులు, రూ.18,500నగదును స్వాధీనం చేసుకున్నారు.
కోడిపందేలు నిర్వహిస్తున్న 55మంది అరెస్ట్ - కోడిపందేలు వార్తలు
అనంతపురం జిల్లా కదిరి గ్రామీణ ప్రాంతాల్లో.. కోడి పందేలు నిర్వహిస్తున్న 55మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు తలుపుల, తనకల్లు మండలాల్లోని బరుల్లో పోలీసులు సోదాలు చేసి.. పందేలు కాస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.
కోడిపందేలు నిర్వహిస్తున్న 55మంది అరెస్ట్