ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీడీఎస్ బియ్యం పక్కదారి.. 50 బస్తాలు సీజ్ - Ration rice seized

50 బియ్యం బస్తాలు ఒక్కోటి 50 కిలోల చొప్పున అక్రమంగా నిల్వ ఉంచిన స్థావరంపై పక్కా సమాచారంతో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. భారీ ప్రజా పంపిణీ బియ్యాన్ని సంచులు మార్చి నిల్వ ఉంచగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా పీడీఎస్ బియ్యం పక్కదారి.. 50 బస్తాలు సీజ్
భారీగా పీడీఎస్ బియ్యం పక్కదారి.. 50 బస్తాలు సీజ్

By

Published : Oct 17, 2020, 7:46 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని సంచులు మార్చి ప్యాకెట్లుగా చేసి బహిరంగ మార్కెట్​లో విక్రయిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ మహేష్ పేర్కొన్నారు. ఈ అక్రమ దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఆయన వివరించారు. పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.

భారీగా పీడీఎస్ బియ్యం పక్కదారి.. 50 బస్తాలు సీజ్

ABOUT THE AUTHOR

...view details