ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలుషిత పెరుగు తిని 49 మంది అస్వస్థత - అనంతపురం జిల్లాలో కలుషిత పెరుగు తిని 49 మంది అస్వస్థత

కలుషిత పెరుగు తిని 49 మంది అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో జరిగింది. అస్వస్థతుకు గురైనవారు చెన్నేపల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

చికిత్స పొందుతున్న బాధితులు
చికిత్స పొందుతున్న బాధితులు

By

Published : Mar 16, 2021, 2:49 PM IST

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో మంజునాథ్ అనే దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు తిని 49 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అస్వస్థతకు గురైనవారు ఓ ప్రైవేట్ వైద్యుడి దగ్గర చికిత్స పొందారు. విషయం బయటికి పొక్కకుండా దుకాణదారుడు ప్రయత్నించాడు. వైద్య సిబ్బంది సోమవారం రాత్రి బాధితుల నివాసాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. నీరసంగా ఉన్నవారిని అత్యవసర వాహనాల్లో చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో న్యామద్దల గ్రామంలోని రామాలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రోగులను ఆలయంలో పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: పరిషత్‌ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details