ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని.. 40 గొర్రెలు మృతి - ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గొర్రెలు మృతి వార్తలు

కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 40 గొర్రెలు మృతి చెందగా.. మరో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టపోయిన తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

40 sheeps dead in RTC bus hit
ఆర్టీసీ బస్సును ఢీకొని 40 గొర్రెలు మృతి

By

Published : Nov 30, 2020, 9:38 AM IST

Updated : Nov 30, 2020, 10:40 AM IST


కూడేరు మండలం శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. అనంతపురం నుంచి బళ్ళారికి వెళ్తున్న బస్సు ముష్టురుకు చెందిన మల్లికార్జున అనే రైతుకు చెందిన గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతుకు సంబంధించిన 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా వేసి తనకు న్యాయం చేయాలని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

Last Updated : Nov 30, 2020, 10:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details