కంబదూరులో 40 మంది గర్భిణులకు అన్నదానం - కంబదూరులో గర్భిణీలకు భోజన సౌకర్యం
అనంతపురం జిల్లా కంబదూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 40మంది గర్భిణులకు స్థానిక వ్యాపారి రాజా, ఉపాధ్యాయుడు తిప్పేస్వామి భోజన సౌకర్యం కల్పించారు.
కంబదూరులో 40 మంది గర్భిణీలకు అన్నదానం...
అనంతపురం జిల్లా కంబదూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 40మంది గర్భవతులకు స్థానిక వ్యాపారి రాజా, ఉపాధ్యాయుడు తిప్పేస్వామి భోజన సౌకర్యం కల్పించారు. నెలనెల పరీక్షల కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మంచి భోజనం అందించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ శివారెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన భోజనం అందించిన దాతలకు ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు అభినందనలు తెలిపారు.