అనంతపురం జిల్లా మూడోవిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. చివరిరోజు అనేక మండలాల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. వైకాపా, తెదేపాల మద్దతుదారులతోపాటు రెబల్స్ కూడా బరిలో నిలిచారు. 19 మండలాల్లో పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేశారు. అనంత డివిజన్ పరిధిలో 379 పంచాయతీలు, 3,736 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అనంత గ్రామీణ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. మూడురోజుల నామినేషన్లు కలిపి మండలాల వారీగా ఇలా ఉన్నాయి.
చివరి రోజూ.. హుషారు! - మూడోవిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి
మూడోవిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. అనంతపురం డివిజన్లోని 19 మండలాల్లో 379 సర్పంచి, 3736 వార్డుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ డివిజన్లో 19 మండలాల్లో అభ్యర్థులు నామినేషన్ల సమర్పణ ముగిసింది.
phase nominations closed
TAGGED:
అనంతపురం జిల్లా వార్తలు