ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ మృతుల కంటే ప్రమాదాల్లో చనిపోయిన వారే అధికం.. జాగ్రత్త అవసరం' - Madakashira National Road Safety Months

అనంతపురం జిల్లా మడకశిరలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన చేపట్టేందుకు పోలీసులు బైకు ర్యాలీ చేశారు.

32nd National Road Safety Month in Madakashira
మడకశిరలో 32వ జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాలు

By

Published : Jan 24, 2021, 10:32 AM IST

కొవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్యే అధికంగా ఉందని అనంతపరం జిల్లా మడకశిర ఆర్టీవో రమేష్ అన్నారు. పట్ణణంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు బైకు ర్యాలీ చేపట్టారు.

డ్రైవర్లు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్​పెక్టర్ దీప్తి, ఎస్ఐ శేషగిరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details